Trisha: నెటిజన్ల దెబ్బకు వెనక్కుతగ్గిన త్రిష.. ‘యానిమల్‌’పై పోస్ట్ డిలీట్

Trisha deletes post on Animal after netizens raise strong objection
  • స్త్రీద్వేషం పాళ్లు ఎక్కువగా ఉన్నాయంటూ ‘యానిమల్‌’పై విమర్శలు
  • యానిమల్ కల్ట్ సినిమా అంటూ త్రిష కామెంట్
  • స్త్రీపురుష సమానత్వంపై గొంతెత్తిన నటి ఇలా చేయొచ్చా? అంటూ నెట్టింట విమర్శలు
  • ఆ తరువాత కొద్దిసేపటికే పోస్ట్ డిలీట్ చేసిన త్రిష
‘యానిమల్’ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ నెట్టింట పోస్ట్ పెట్టిన త్రిషపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె వెనక్కుతగ్గింది. పోస్ట్ పెట్టిన కాసేపటికే తొలగించింది. రణ్‌బీర్ కపూర్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరో పాత్రలో స్త్రీద్వేషం కనబడుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో, సందీప్ రెడ్డి తొలి సినిమా ‘అర్జున్ రెడ్డి’ విషయంలోనూ ఇదే తరహా ఫిర్యాదులు వచ్చాయి.

ఇదిలా ఉంటే యానిమల్ సినిమాకు కల్ట్ స్థాయి ఉందంటూ త్రిష తాజాగా ఇన్‌స్టాలో కామెంట్ పెట్టారు. ఇది చూసి నెటిజన్లు ఒక్కసారిగా భగ్గుమన్నారు. గతంలో స్త్రీపురుష సమానత్వంపై గొంతెత్తిన త్రిష ఇప్పుడిలా స్త్రీ ద్వేషం ప్రదర్శించే పాత్రకు బ్రహ్మరథం పట్టడమేంటని ప్రశ్నించారు. మరికొందరు త్రిషను కుహనా ఫెమినిస్టు అని కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలోనే త్రిష తన కామెంట్‌ను వెనక్కు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Trisha
Kollywood
Ranbir Kapoor

More Telugu News