Transco: ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా

Transco genco CMD Prabhakar Rao Resignation

  • వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి
  • రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే రాజీనామా
  • అప్పట్లో టీఆర్ఎస్ సర్కారు హయాంలో నియామకం
  • విశ్రాంత అధికారికి పదవి.. ఏళ్ల తరబడి పొడగింపు

తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఉదయం మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేయడం గమనార్హం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం (ఇప్పటి బీఆర్ఎస్) హయాంలో ప్రభాకర్ రావు ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా బాధ్యతలు చేపట్టారు.

సీఎండీ వంటి కీలక పోస్టులో ఐఏఎస్ అధికారులను నియమిస్తుంటారు. అయితే, టీఆర్ఎస్ సర్కారు మాత్రం రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకర్ రావును సీఎండీగా నియమించింది. అప్పటి నుంచి ఆయన పదవీ కాలం ముగిసిన ప్రతిసారీ ప్రభుత్వం రెండేళ్లపాటు పొడిగిస్తూ వచ్చింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు బాధ్యతల నుంచి తప్పుకోవడంపై చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News