Telangana Assembly Results: తెలంగాణలో ఓఎస్డీల రాజీనామా
- యాంటీ నక్సల్ ఇంటెలిజెన్స్ విభాగం ఓఎస్డీ ప్రభాకర్ రావు రాజీనామా
- టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్ రావు రాజీనామా
- సీఎస్‌కు రాజీనామాలు పంపించిన ఓఎస్డీలు
తెలంగాణలో పలు ఓస్డీలు రాజీనామా చేస్తున్నారు. సీఎస్‌కు రాజీనామా లేఖలను పంపించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌లోని యాంటీ నక్సల్ ఇంటెలిజెన్స్ విభాగానికి ప్రత్యేక అధికారిగా (ఓఎస్డీ)గా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి టీ ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. కేసీఆర్‌కు ఆయనను సన్నిహితుడిగా చెబుతారు. ప్రభాకర్ రావు మూడేళ్ల క్రితం పదవీ విరమణ చేసి, ఆ తర్వాత ఇంటెలిజెన్స్ ఓఎస్డీగా కొనసాగుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మారిన సమీకరణాల దృష్ట్యా ప్రభాకర్ రావు రాజీనామాను సమర్పించారు.
టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్ రావు కూడా రాజీనామా చేశారు. మూడేళ్ల క్రితం పదవీ విరమణ పొందిన రాధాకిషన్ రావును కేసీఆర్ ప్రభుత్వం ఓఎస్డీగా నియమించింది. గత నెలలో ఓఎస్డీ బాధ్యతల నుంచి ఈసీ తప్పించింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తన రాజీనామాను సీఎస్‌కు పంపించారు. వీరు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.