Padi Kaushik Reddy: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు
- ఎన్నికల్లో ఈటలను ఓడించిన కౌశిక్ రెడ్డి
- పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారంటూ ఫిర్యాదు
- ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనన్న పోలీసులు
- 290, 353, 506 సెక్షన్ల కింద కేసు
హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను ఓడించిన బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో ఐపీసీ సెక్షన్ 290, 353, 506 కింద కేసు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డి ఓట్ల లెక్కింపు వేళ పోలీసులతో వాగ్వాదానికి దిగి ఉద్రిక్త వాతావరణం సృష్టించారని, ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని పోలీసులు అంటున్నారు. కాగా, పోలింగ్ కు ముందు తనను గెలిపించకపోతే తన కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యం అని పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించడం సంచలనం సృష్టించింది.