Congress: వినోద్ కుమార్ సహా పలు కార్పోరేషన్ చైర్మన్ల రాజీనామా
- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవికి వినోద్ కుమార్ రాజీనామా
- రాష్ట్ర డెయిలీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవికి సోమా భరత్ రాజీనామా
- పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి గెల్లు శ్రీనివాస్ రాజీనామా
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కేసీఆర్ ప్రభుత్వంలో పని చేసిన పలువురు కార్పోరేషన్ చైర్మన్లు రాజీనామాలు చేస్తున్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవికి బోయినపల్లి వినోద్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పంపించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రానున్న రోజుల్లో పనిచేస్తామని ప్రకటించారు. వినోద్ కుమార్ తో పాటు పలువురు కార్పోరేషన్ చైర్మన్లు రాజీనామా చేశారు.
రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న సోమా భరత్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా ఉన్న జూలూరి గౌరీశంకర్, గొర్రెలు, మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఉన్న దూదిమెట్ల బాలరాజు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న రవీందర్ సింగ్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న కే వాసుదేవరెడ్డి, టీఎస్‌ఎండీసీ చైర్మన్‌గా ఉన్న మన్నె క్రిశాంక్, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఉన్న గెల్లు శ్రీనివాస్, గీతవృత్తిదారుల సహకార సంస్థ చైర్మన్‌గా ఉన్న పల్లె రవికుమార్, టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్‌గా ఉన్న పాటిమీద జగన్‌మోహన్‌రావు, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న అనిల్ కూర్మాచలం, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న గజ్జెల నగేశ్, టీఎస్‌ఫుడ్స్ చైర్మన్‌గా ఉన్న మేడే రాజీవ్‌సాగర్, శాక్స్ చైర్మన్‌గా ఉన్న ఆంజనేయగౌడ్, రెడ్‌కో చైర్మన్‌గా ఉన్న వై సతీశ్‌రెడ్డి, ట్రైకార్ చైర్మన్‌గా ఉన్న రామచంద్రనాయక్, టెక్స్‌టైల్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న గూడూరు ప్రవీణ్, జీసీసీ చైర్మన్‌గా ఉన్న వాల్యానాయక్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు రాజీనామాలను సమర్పించారు.