Telangana Assembly Results: ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు... తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్
- అక్టోబర్ రెండో వారం నుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
- 64 సీట్లలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ
- ముఖ్యమంత్రి అభ్యర్థిపై కాంగ్రెస్ లో చర్చోపచర్చలు
తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 9వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో, బీఆర్ఎస్ 39 నియోజకవర్గాల్లో, బీజేపీ 8 సీట్లు, మజ్లిస్ 7 సీట్లు, సీపీఐ 1 స్థానంలో గెలుపొందాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి ఎంపిక రేపటికి వాయిదాపడింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, నలుగురు పరిశీకులు అధిష్ఠానంతో చర్చించేందుకు ఢిల్లీకి బయలుదేరారు.