non veg shops: రోడ్డుపక్క నాన్-వెజ్ దుకాణాలన్నింటినీ మూసివేయండి: ఎన్నికల్లో గెలిచిన వెంటనే రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే హుకుం
- ఎన్నికల్లో గెలుపు అనంతరం రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే బల్ముకుంద్ ఆచార్య వివాదాస్పద వ్యాఖ్యలు
- బహిరంగంగా నాన్ వెజ్ విక్రయిస్తారా అంటూ పోలీసు అధికారికి ప్రశ్న
- ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ
వీధుల్లో రోడ్డుపక్కన ఉన్న నాన్-వెజ్ దుకాణాలన్నింటినీ మూసివేయాలని రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన బీజేపీ నేత బల్ముకుంద్ ఆచార్య హుకుం జారీ చేశారు. తమ ప్రాంతంలోని అన్ని వీధుల్లో నాన్ వెజ్ స్టాల్స్‌ను మూసివేయాలని అన్నారు. ఈ మేరకు ఓ పోలీసు అధికారితో ఆయన చెప్పారు. రోడ్డుపై బహిరంగంగా నాన్ వెజ్ అమ్ముతారా అని అధికారిని ప్రశ్నించారు. వెంటనే రోడ్డు పక్క నాన్ వెజ్ స్టాల్స్ అన్నీ మూసివేయాలన్నారు. సాయంత్రం రిపోర్ట్ తీసుకుంటానని, అధికారి ఎవరనేది పట్టించుకోనని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీనిపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇలా ఎలా చేయగలని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలను ఆయన ఖండించారు. ఎవరైనా ఒక వ్యక్తి నాన్‌వెజ్ ఫుడ్ స్టాల్ పెట్టాలనుకుంటే దాన్ని ఎవరైనా ఎలా ఆపగలరని ఒవైసీ ఖండించారు.
కాగా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాల్ముకుంద్ రాజస్థాన్‌లోని హవామహల్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై 600 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఇదిలావుంచితే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 115 సీట్లు గెలుచుకుని అధికారాన్ని సొంతం చేసుకుంది. 69 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ 2వ స్థానానికి పరిమితమైంది. ఇక రాజస్థాన్‌లో 8 మంది స్వతంత్రులు విజయం సాధించడం గమనార్హం.