Telangana CM: తెలంగాణ కొత్త సీఎంకు తెలుపు రంగులో సరికొత్త కాన్వాయ్ సిద్ధం
- తెలంగాణలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్
- సీఎం కోసం ఏర్పాట్లు చేస్తున్న జీఏడీ
- ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కొత్త కాన్వాయ్ లో సీఎం వెళ్లేలా ఏర్పాట్లు
తెలంగాణ ఏర్పడిన పదేళ్లకు రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టబోతోంది. 64 స్థానాల్లో గెలుపొంది క్లియర్ మెజార్టీ సాధించిన కాంగ్రెస్ రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మరోవైపు కొత్త సీఎం కోసం జీఏడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త కాన్వాయ్ ను ఏర్పాటు చేసింది. సీఎం కాన్వాయ్ లో ఆరు వాహనాలను సిద్ధం చేసింది. ఈ వాహనాలు తెలుపు రంగులో ఉన్నాయి. సీఎం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ కాన్వాయ్ లో వెళ్లేలా ఏర్పాటు చేసింది.
మరోవైపు, సీఎం ఎవరనే దానిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలను చేపడతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ... ఆ దిశగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీనిపై చర్చించేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను పార్టీ హైకమాండ్ నిన్న ఢిల్లీకి పిలిపించుకుంది. సీఎం, డిప్యూటీ సీఎంలు, మంత్రులు ఎవరనేదానిపై ఈరోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.