Aamir Khan: చెన్నైలో ఆమిర్ ఖాన్, హీరో విష్ణువిశాల్ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించిన రెస్క్యూ టీమ్

Rescue team helps Aamir Khan and Vishnu Vishal family in Chennai
  • చెన్నైలో తుపాను విలయం
  • ఇంకా ముంపులోనే పలు ప్రాంతాలు
  • తమ ఇల్లు నీట మునిగిందంటూ హీరో విష్ణువిశాల్ ట్వీట్
  • రబ్బరు బోట్లు పంపించిన అధికారులు
  • విష్ణు విశాల్ పంచుకున్న ఫొటోల్లో దర్శనమిచ్చిన ఆమిర్ ఖాన్
మిచౌంగ్ తీవ్ర తుపాను సెలెబ్రిటీలను సైతం ఆందోళనకు గురిచేసింది. చెన్నైలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. తమిళ యువ హీరో విష్ణువిశాల్ ఇంటి పైకి ఎక్కి సాయం కోసం అర్థించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా వరదల్లో చిక్కుకుపోయిన వైనం ఫొటోల ద్వారా వెల్లడైంది. విష్ణువిశాల్ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన అధికారులు కరప్పాక్కం ఏరియాకు రెస్క్యూ టీమ్ ను పంపారు. 

ఈ రెస్క్యూ బృందం ఆమిర్ ఖాన్ తో పాటు హీరో విష్ణువిశాల్, గుత్తా జ్వాల దంపతులను కూడా రబ్బరు బోట్ల సాయంతో కాపాడింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీనికి సంబంధించిన ఫొటోలను విష్ణు విశాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. విష్ణువిశాల్ పంచుకున్న ఫొటోల్లోనే ఆమిర్ ఖాన్ కూడా దర్శనమిచ్చాడు. 

అగ్నిమాపక దళ సిబ్బందికి, రెస్క్యూ బృందాలకు విష్ణువిశాల్ కృతజ్ఞతలు తెలిపాడు. ఇలాంటి కష్టసమయాల్లో తమిళనాడు ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపడుతోందని అభినందించాడు.
Aamir Khan
Vishnu Vishal
Gutta Jwala
Chennai
Rains
Cyclone Michaung

More Telugu News