US Job Openings: అమెరికాలో దారుణంగా పడిపోయిన జాబ్ ఓపెనింగ్స్
- అమెరికాలో రెండోసారి 90 లక్షల కంటే తక్కువకు పడిపోయిన ఉద్యోగావకాశాలు
- అక్టోబర్ చివరి బిజినెస్ డే నాడు ఖాళీగా 8.73 మిలియన్ ఉద్యోగాలు
- ప్రస్తుతం ప్రతి ఉద్యోగార్థికి 1.3కు పడిపోయిన జాబ్ ఓపెనింగ్స్
అమెరికాలో ఉద్యోగావకాశాలు దారుణంగా పడిపోయాయి. మార్చి 2021 తర్వాత అక్టోబరులో అమెరికాలో ఉద్యోగావకాశాల సంఖ్య రెండోసారి 90 లక్షల కంటే తక్కువకు పడిపోయింది. యూఎస్ లేబర్ మార్కెట్ కూలింగ్ను ఇది సూచిస్తోంది. తాజా జాబ్ ఓపెనింగ్స్, లేబర్ టర్నోవర్ (జేవోఎల్టీఎస్) ప్రకారం.. అక్టోబర్ చివరి బిజినెస్ డే నాడు 8.73 మిలియన్ ఉద్యోగాలు ఖాళీలుగా మిగిలిపోయాయి. మార్చి 2021 తర్వాత ఈ సంఖ్య అత్యల్పం. గత నెలలో విడుదలైన బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం అక్టోబరులో.. జనవరి 2021 నుంచి ఉద్యోగాలు కనిష్ఠ స్థాయికి మందగించడం ఇది రెండోసారి.