Extra Ordinary Man: ఈ డైరెక్టర్ కి ఇప్పుడు హిట్టు చాలా అవసరమే!
- రచయితగా పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ
- దర్శకుడిగా మొదటి సినిమా 'నా పేరు సూర్య'
- అంతగా ఆకట్టుకోలేకపోయిన సినిమా
- రెండో ప్రయత్నంగా వస్తున్న 'ఎక్స్ ట్రా'
- ఈ నెల 8వ తేదీన ఈ సినిమా విడుదల
వక్కంతం వంశీ .. సినీ రచయితగా ఆయన పేరు చాలామందికి తెలుసు. చాలా సినిమాలకు ఆయన కథ .. సంభాషణలను అందించారు. కథా రచయితగా ఆయన పనిచేసిన సినిమాలలో 'రేసు గుర్రం' .. 'టెంపర్' .. 'ఎవడు' ... 'కిక్' ఘనవిజయాలను సాధించాయి. ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలోనే ఆయన దర్శకుడిగా మెగాఫోన్ పట్టాడు.
త్రివిక్రమ్ .. కొరటాల .. అనిల్ రావిపూడి వీళ్లంతా రైటింగ్ వైపు నుంచి డైరెక్షన్ వైపు వచ్చినవారే. అలాగే వంశీ కూడా అదే దారిలో అడుగు ముందుకు వేశాడు. బన్నీతో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాను తెరకెక్కించాడు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. దాంతో సహజంగానే వంశీకి గ్యాప్ వచ్చింది.
ఆ తరువాత సినిమాగా ఆయన చేసిన సినిమానే 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్'. నితిన్ హీరోగా వంశీ ఈ సినిమాను రూపొందించాడు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. నితిన్ జోడీగా శ్రీలీల నటించింది. దర్శకుడిగా వక్కంతం వంశీకి ఈ సినిమా హిట్ కొట్టడం చాలా అవసరం. అలాగే వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న నితిన్ ను గట్టెక్కించవలసిన బాధ్యత కూడా ఈ సినిమాపై ఉంది.