election commssion: జనవరి 1వ తేదీ నాటికి ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈసీ సూచన
- 2024 ఏప్రిల్, మే నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం
- ఈ క్రమంలో ఓటర్ల జాబితా సవరణ కోసం షెడ్యూల్ ప్రకటన
- జనవరి 9వ తేదీ నాటికి ఓటర్ల తుది జాబితా ప్రకటన
లోక్ సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. 2024 ఏప్రిల్, మే నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ క్రమంలో ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, ఓటర్ల ఫొటోల మార్పునకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ నెల 20 నుంచి 2024, జనవరి 5వ తేదీ వరకు అవకాశమిచ్చారు. 2024, జనవరి 6న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. జనవరి 8వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. 2024 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.