NPDCL: తెలంగాణలో కొనసాగుతున్న రాజీనామాలు.. పదవి నుంచి తప్పుకున్న ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు
- ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శికి రాజీనామా లేఖ
- ఇన్నేళ్లపాటు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ గోపాల్‌రావు కృతజ్ఞతలు
- పదవి తనకు సంతృప్తినిచ్చిందని వ్యాఖ్య
తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నత పదవుల్లో ఉన్నవారు వరుసపెట్టి రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు చేరారు. ఆయన నిన్న తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శికి పంపించారు.
అనంతరం గోపాల్‌రావు మాట్లాడుతూ.. ఈ సుదీర్ఘ ప్రయాణంలో పదవి తనకు చాలా సంతృప్తినిచ్చిందన్నారు. ఇంతకాలం తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇటీవల ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, సాంస్కృతిక సలహాదారు రమణాచారి రాజీనామా చేశారు. తాజాగా, గోపాల్‌రావు కూడా తప్పుకున్నారు.