KCR: కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోదా ఆసుపత్రి వైద్యులు

KCR health bulletin

  • కేసీఆర్ ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయిందన్న డాక్టర్లు
  • విరిగిన తుంటిని రీప్లేస్ చేయాల్సి ఉందని వెల్లడి
  • కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందన్న డాక్టర్లు

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ ను యశోదా ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. తన నివాసంలోని బాత్రూమ్ లో కేసీఆర్ స్లిప్ అయ్యారని... దీంతో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి ఆయనను తీసుకొచ్చారని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు. సీటీ స్కాన్ తో పాటు పలు పరీక్షలను నిర్వహించిన అనంతరం... ఆయన ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించామని చెప్పారు. ఆయన ఎడమ తుంటిని రీప్లేస్ చేయాల్సి ఉందని వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని చెప్పారు. ఆర్థోపిడిక్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్, పెయిన్ మెడిసిన్ విభాగాలకు చెందిన మల్టీ డిసిప్లినరీ టీమ్ ఆయనను పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. క్రమం తప్పకుండా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అప్డేట్స్ ను అందిస్తామని తెలిపారు. 

  • Loading...

More Telugu News