Revanth Reddy: నాది తెలంగాణ అని చెప్పుకునే అవకాశాన్ని సోనియాగాంధీ ఇచ్చారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy praises Sonia Gandhi

  • సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలు ఇచ్చారన్న రేవంత్ రెడ్డి
  • ఈ రోజు రెండు గ్యారెంటీలను అమలు చేస్తున్నట్లు వెల్లడి
  • ఆరు గ్యారెంటీలను ఒక్కటొక్కటిగా 100 రోజుల్లో అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి

ఈ రోజు తెలంగాణ ప్రజలకు పండుగ రోజు అని, 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి అంటే సోనియా గాంధీ రూపం కనిపిస్తుందని, నాది తెలంగాణ అని చెప్పుకునే అవకాశాన్ని మనకు సోనియా గాంధీ ఇచ్చారని తెలిపారు. ప్రజల కోసమే సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలు ఇచ్చారని, ఇందులో భాగంగా ఈ రోజు రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కటొక్కటిగా వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు.

మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలలకు పెంచే మరో పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ లోగో, పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎస్ శాంతికుమారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News