Amitabh Bachchan: కోడలు ఐశ్వర్య రాయ్‌ను అన్‌ఫాలో అయిన అమితాబ్!

Amitabh Bachchan Unfollows Aishwarya Rai on Instagram Days After The Archies Premiere
  • ఇన్‌స్టాలో బిగ్ బీ ఫాలో అవుతున్న వారిలో లిస్టులో కనిపించని ఐశ్వర్య
  • బిగ్ బీ మనవడు నటించిన ‘ది ఆర్చీస్’ విడుదలైన కొన్ని రోజులకే ఘటన
  • ఆశ్చర్యంలో అభిమానులు
బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ తన కోడలు ఐశ్వర్య రాయ్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేశారన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. బిగ్ బీ మొత్తం 74 మంది సెలబ్రిటీలను ఫాలో అవుతారు. సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్ వంటి స్టార్లు ఈ జాబితాలో ఉన్నారు. అయితే, లిస్టులో ఐశ్వర్య కనిపించకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

అమితాబ్ మనవడు అగస్త్య నంద నటించిన ‘ది ఆర్చీస్’ ఇటీవలే విడుదలైంది. ముంబైలో ప్రదర్శించిన ఈ చిత్రం ప్రీమియర్‌కు అమితాబ్ కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఐశ్వర్య, అమితాబ్..ఇలా అందరూ సంతోషంగా కెమెరాలకు పోజులిస్తూ కనిపించారు. ఇంతలోనే అమితాబ్ ఐశ్వర్యను అన్‌ఫాలో అయిన వార్త వైరల్‌గా మారింది. అయితే, కొందరు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. అమితాబ్ ఇన్‌స్టా అకౌంట్ సెట్టింగ్స్ కారణంగా ఆయన ఎవరినీ ఫాలో అవుతోందీ బహిరంగంగా తెలియకపోవచ్చని కొందరు కామెంట్ చేశారు. అయితే, ఈ కథనం అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అభిషేక్, ఐశ్వర్య విడిపోతున్నారన్న వార్త కూడా చక్కర్లు కొడుతోంది.
Amitabh Bachchan
Aishwarya Rai
Bollywood

More Telugu News