Vande Bharat: సికింద్రాబాద్ నుంచి మరో వందేభారత్ రైలు!
- ఇప్పటికే దేశంలో వివిధ రూట్లలో వందేభారత్ రైళ్లు
- త్వరలో మరో 10 వందేభారత్ రైళ్లకు పచ్చజెండా
- వాటిలో సికింద్రాబాద్-పుణే రైలు!
సికింద్రాబాద్ నుంచి ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఒకటి సికింద్రాబాద్-విశాఖ మార్గంలో మరొకటి సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో నడుస్తున్నాయి. ఇప్పుడు మరో వందేభారత్ రైలు సికింద్రాబాద్ నుంచి పరుగులు తీయనుంది. ఈ కొత్త వందేభారత్ రైలు సికింద్రాబాద్ నుంచి పూణే మార్గంలో నడవనుంది.
దేశంలో వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లకు మాంచి డిమాండ్ ఉండడంతో రైల్వే శాఖలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఈ నేపథ్యంలో, త్వరలోనే ఒకే రోజున 10 మార్గాల్లో వందేభారత్ రైళ్లకు ప్రధాని మోదీ వర్చువల్ గా పచ్చజెండా ఊపనున్నారు. వీటిలో సికింద్రాబాద్-పుణే రైలు కూడా ఉంది.
అయితే ఇది వందేభారత్ రైలా, వందే సాధారణ్/అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.