paidi rakesh reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సంచలన ఆరోపణలు

BJP MLA Paidi Rakesh Reddy allegations on Jeevan Reddy
  • జీవన్ రెడ్డి తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపణ
  • విదేశాల నుంచి కూడా తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని వ్యాఖ్య
  • జీవన్ రెడ్డి అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్
బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ... తనను చంపుతామంటూ విదేశాల నుంచి కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ క్వారీలు, అక్రమ మొరం తవ్వకాలపై సీబీఐ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ఆర్మూర్‌లోని సహజసిద్ధమైన వనరులను కాపాడుతానని రాకేశ్ రెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు, అంకాపూర్లోని రాకేశ్ రెడ్డి నివాసానికి ఈ రోజు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. దీంతో ఆయన నివాసం సందడిగా మారింది.
paidi rakesh reddy
Jeevan Reddy
BJP
BRS

More Telugu News