Nara Lokesh: సంక్షేమం, అభివృద్ధిని పరిచయం చేసింది టీడీపీయే అనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి?: లోకేశ్
- యువగళం పాదయాత్రకు నేడు 220వ రోజు
- పాయకరావుపేట నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్రకు విశేష స్పందన
- మరో మూడు నెలల్లో ప్రజా ప్రభుత్వం వస్తోందన్న లోకేశ్
- దళితులకు సైకో ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోందని విమర్శలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 220వ రోజు పాయకరావుపేట నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. నామవరం విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్రకు అడుగడుగునా మహిళలు, యువకులు, వృద్ధులు సంఘీభావం తెలుపుతూ లోకేశ్ కు నీరాజనాలు పట్టారు. దారిపొడవునా టీడీపీ కార్యకర్తలు, నాయకులు బాణసంచా మోతలు, గజమాలలతో స్వాగతించారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక పన్నులు, ధరల భారం పెరిగి బతుకుబండి లాగలేకపోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు నేతృత్వంలో మరో 3 నెలల్లో రాబోయే ప్రజాప్రభుత్వం ధరలు, పన్నుల భారం తగ్గించి ఉపశమనం కలిగిస్తుందని లోకేశ్ వారికి భరోసా ఇచ్చారు. పాదయాత్ర దారిలో మహిళలు, రేషన్ డీలర్లు, కేబుల్ ఆపరేటర్లు, రైతులు, బీసీలు, వివిధ వర్గాల ప్రజలు లోకేశ్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
నామవరం నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర... దేవవరం, వడ్డిమిట్ట, గొడిచర్ల, ఉద్దండపురం వెపాడు, చినదొడ్డిగల్లు, న్యాయంపూడి, వెదుళ్లపాలెం, గురుకులం, ఉపమాక అగ్రహారం మీదుగా కృష్ణగోకులం ఉడా లేఅవుట్ వద్ద విడిది కేంద్రానికి చేరుకుంది.
దళిత బిడ్డలకు సైకో ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోంది: లోకేశ్
నక్కపల్లి బాలికల గురుకుల పాఠశాల వద్ద లోకేశ్ సెల్ఫీ దిగి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "ఇది ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా 1984లో పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో ఏర్పాటుచేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల. గ్రామీణ ప్రాంతాల్లో దళిత బిడ్డలకు మెరుగైన విద్యను అందించేందుకు ఎన్టీఆర్ రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుడితే, ఆ తర్వాత చంద్రబాబునాయుడు వాటిని మరింతగా విస్తరించారు.
2014-19 నడుమ చంద్రబాబు హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 15 గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేసి, మరో 15 ఎస్సీ గురుకులాలను మంజూరు చేశారు. మరో 3 నెలల్లో పదవీకాలం పూర్తి కావస్తున్న సైకో సిఎం జగన్... టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన 15 గురుకులాలలను రద్దు చేసి దళిత బిడ్డలకు తీరని ద్రోహం చేశాడు.
గత నాలుగున్నరేళ్లలో జగన్ సర్కారు ఏర్పాటు చేసింది కేవలం ఒకే ఒక్క గురుకుల పాఠశాల మాత్రమే. తెలుగు ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ అనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి?" అని అన్నారు.
====
*యువగళం పాదయాత్ర వివరాలు*
*ఈరోజు నడిచిన దూరం 17.6 కి.మీ.*
*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం కి.మీ. 3041.3*
*221వరోజు (13-12-2023) యువగళం వివరాలు*
*పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం*
ఉదయం
8.00 – నక్కపల్లి కృష్ణగోకులం లేఅవుట్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.10 – సరిపల్లిపాలెంలో మత్స్యకారులతో సమావేశం.
8.25 – కోనవానిపాలెంలో కొబ్బరిపీచు కార్మికులతో సమావేశం.
9.10 – తిమ్మాపురం అడ్డరోడ్డులో స్థానికులతో సమావేశం.
10.25 – గోకులపాడులో సుగర్ ఫ్యాక్టరీ కార్మికులతో సమావేశం.
11.25 – పెనుగొల్లు గ్రామంలో భోజన విరామం.
మధ్యాహ్నం
2.00 – పెనుగొల్లులో బీసీ సామాజికవర్గీయులతో ముఖాముఖి.
సాయంత్రం
4.00 – పెనుగొల్లు నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.30 – పెనుగొల్లులో రైతులతో సమావేశం.
5.00 – పాదయాత్ర యలమంచిలి నియోజకవర్గంలోకి ప్రవేశం.
5.45 – పాలపర్తిలో స్థానికులతో సమావేశం.
6.00 – లక్కవరంలో ములకలపల్లిలో రైతులతో సమావేశం.
6.20 – ములకలపల్లిలో యువతతో సమావేశం.
6.50 – పురుషోత్తమపురంలో రైతులతో సమావేశం.
రాత్రి
7.20 – పోతిరెడ్డిపాలెంలో స్థానికులతో సమావేశం.
8.05 – రేగుపాలెం జంక్షన్ లో స్థానికులతో సమావేశం.
9.20 – కొత్తూరు ఎస్ వి కన్వెన్షన్ సెంటర్ వద్ద విడిది కేంద్రంలో బస.
*****