Bathukamma Sarees: బతుకమ్మ చీరల బకాయిలు రూ. 200 కోట్లు.. రేవంత్ ప్రభుత్వంపై నేతన్నల ఆశలు

Foremer Govt Dues to Bathukamma Sarees about Rs 200 Cr

  • బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేసిన గత ప్రభుత్వం
  • నూలు సబ్సిడీ కూడా చెల్లించని వైనం
  • వచ్చే ఏడాది ఆర్డర్ కూడా తమకే ఇవ్వాలంటున్న సిరిసిల్ల నేత కార్మికులు

బతుకమ్మ పండుగ సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు పంపిణీ చేసిన బతుకమ్మ చీరలకు సంబంధించి కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. వాటిని తయారుచేసిన సిరిసిల్ల నేత కార్మికులకు దాదాపు రూ. 200 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. అంతేకాదు 2022, 2023 సంవత్సరాలకు సంబంధించి నూలు సబ్సిడీ కింద ఇవ్వాల్సిన రూ. 20 కోట్లు కూడా పెండింగ్‌లోనే ఉందని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో బకాయిలు చెల్లింపులు ఉంటాయో? లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అంతేకాదు, వచ్చే ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ ఉంటుందా? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు రాజకీయాలకు అతీతంగా ఆలోచించి తమకు రావాల్సిన బకాయిలు చెల్లించడంతోపాటు వచ్చే ఏడాది చీరల ఆర్డర్ కూడా తమకే ఇవ్వాలని కోరుతున్నారు. స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు కూడా గత ప్రభుత్వం తమకే ఇచ్చిందని, ఈసారీ తమకే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • Loading...

More Telugu News