Vijay Antony: ఇప్పటి నుంచి నేను దేవుడిని నమ్మను: హీరో విజయ్ ఆంటోనీ భార్య

From now I dont believe in God says actor Vijay Antony wife
  • ఇటీవలే విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య
  • విషాదం నుంచి కోలుకోలేకపోతున్న విజయ్ దంపతులు
  • అవసరమైన సమయంలో దేవుడు తనతో నిలబడలేదన్న విజయ్ భార్య
'బిచ్చగాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా తమిళ హీరో విజయ్ ఆంటోనీ చాలా దగ్గరయ్యారు. హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్ గా, దర్శకుడిగా ఆయన బిజీగా ఉంటున్నారు. నిర్మాతగా కూడా మారి సినిమాలను నిర్మిస్తున్నారు. ఆయన భార్య ఫాతిమా ఆంటోనీ కూడా తన భర్తకు చేదోడుగా ఉంటూ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల వీరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వీరి పెద్ద కుమార్తె మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన నుంచి విజయ్, ఫాతిమా దంపతులు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. 

తాజాగా ఫాతిమా స్పందిస్తూ... ఇకపై తాను దేవుడిని నమ్మనని చెప్పారు. ఈ క్షణం నుంచి తాను దేవుడిని నమ్మనని.. తనకు అవసరమైన సమయంలో దేవుడు తనతో నిలబడలేదని అన్నారు. దేవుడిని నమ్ముకుంటే అంతా గందరగోళంగా ఉంటుందని... గుండెనొప్పి తప్ప మరేమీ ఉండదని వ్యాఖ్యానించారు.
Vijay Antony
Kollywood
wife

More Telugu News