Devineni Uma: మాకొద్దీ జగన్ అని ప్రజలే కాదు.. సొంత పార్టీ నేతలు కూడా అంటున్నారు: దేవినేని ఉమా
- ఒక్క ఛాన్సే ఆఖరి ఛాన్స్ అయిందన్న దేవినేని
- 54 నెలలుగా రాష్ట్రాన్ని దోచుకుంటూ తాడేపల్లి ఖజానా నింపుకున్నారని ఆరోపణ
- జగన్ అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని వ్యాఖ్య
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మరోసారి విమర్శలు గుప్పించారు. మాకొద్దీ జగన్ అని ప్రజలే కాకుండా... సొంత పార్టీ నేతలు కూడా అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే వైసీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తున్నారని చెప్పారు. జగన్ అడిగినట్టుగానే ఒక్క ఛాన్సే ఆఖరి ఛాన్స్ అయిందని అన్నారు. 54 నెలలుగా రాష్ట్రాన్ని దోచుకుని తాడేపల్లి ఖజానాను నింపుకున్నారని ఆరోపించారు. ప్రజల వ్యతిరేకతకు భయపడి బ్యారికేడ్లు, పరదాల మాటున తిరుగుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ అవినీతి, అరాచక పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు. వార్తాపత్రికల్లో వచ్చిన న్యూస్ ను షేర్ చేశారు.