MS Dhoni Jersey: బీసీసీఐ కీలక నిర్ణయం.. ధోనీ జెర్సీ నంబర్ 7కు రిటైర్మెంట్.. ఆటగాళ్లకు ఆదేశాలు

MS Dhoni Number 7 Jersey Retired

  • టీమిండియా మాజీ సారథి ధోనికి అరుదైన గౌరవం
  • సచిన్ జెర్సీ నంబర్ 10 లానే.. నంబర్ 7 జెర్సీకి కూడా రిటైర్మెంట్
  • మరే ఆటగాడు దీనిని ఎంచుకోవద్దని బీసీసీఐ ఆదేశాలు

దేశానికి రెండు ప్రపంచకప్‌లు అందించిన టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనికి బీసీసీఐ నుంచి మరో గౌరవం లభించింది. ధోనీ ధరించే నంబర్ 7 జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నంబర్ 10 జెర్సీకి ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించగా, ఇప్పుడు ధోనీ జెర్సీకి కూడా విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది. జట్టుకు ఈ వికెట్ కీపర్ బ్యాటర్ అందించిన సేవలకు గుర్తుగా 7వ నంబరు జెర్సీని కూడా ఈ జాబితాలో చేర్చాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
 
 నంబర్ 7 జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించాలని బీసీసీఐ నిర్ణయించిందని, కాబట్టి ఆటగాళ్లు ఎవరూ ఆ నంబరును ఎంచుకోవద్దని ప్లేయర్లకు బీసీసీఐ సమాచారమిచ్చినట్టు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఓ కథనంలో పేర్కొంది. భారత యువ ఆటగాడు శార్దూల్ ఠాకూర్ మొదట్లో కొద్దికాలంపాటు నంబర్ 10 జెర్సీ ధరించాడు. ఇది చర్చనీయాంశం కావడంతో ఆ తర్వాత దానిని వదిలిపెట్టాడు. కాగా, బీసీసీఐ ప్రస్తుతం 60 నంబర్లను జట్టులోని రెగ్యులర్ ఆటగాళ్ల కోసం కేటాయించింది. ఎవరైనా ఆటగాడు జట్టుకు ఏడాది దూరంగా ఉన్నా సరే అతడి నంబరును కొత్త ఆటగాడికి ఇవ్వబోమని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. దీనిని బట్టి అరంగేట్ర ఆటగాడు ఎంచుకునేందుకు 30 నంబరు మాత్రమే ఉన్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News