Sai Dharam Tej: నేడు లావణ్య త్రిపాఠి పుట్టినరోజు... ఆసక్తికర ఫొటో పంచుకున్న సాయిధరమ్ తేజ్

Sai Dharam Tej shares interesting pic on Lavanya Tripathi birthday
  • ఇటీవలే పెళ్లితో ఒక్కటైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి
  • విదేశాల్లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న జంట
  • నేడు లావణ్య త్రిపాఠి పుట్టినరోజు
  • తనదైన శైలిలో విషెస్ తెలిపిన సాయిధరమ్ తేజ్
టాలీవుడ్ అందాల భామ లావణ్య త్రిపాఠి ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నవంబరు 1న ఇటలీలోని టస్కనీలో ఘనంగా పెళ్లి చేసుకున్న ఈ లవ్ జంట ప్రస్తుతం హనీమూన్ ఎంజాయ్ చేస్తోంది. 

కాగా, ఇవాళ (డిసెంబరు 16) లావణ్య త్రిపాఠి పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో, మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆమెకు వినూత్న రీతిలో ఆసక్తికర ఫొటోతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. 

లావణ్య, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఈ ఫొటోలో ఉన్నారు. లావణ్య చిరునవ్వులు చిందిస్తుండగా, సాయిధరమ్ తేజ్ ఆమె వైపు తదేకంగా చూస్తుండగా, వరుణ్ తేజ్ కోరచూపులు చూస్తుండడం గమనించవచ్చు. ఈ ఫొటోలోని సీన్ కు అనుగుణంగా సాయిధరమ్ తేజ్ ఆసక్తికరమైన స్క్రిప్టు కూడా జత చేశాడు. 

ఏయ్... కౌన్ హై రే తు? (ఎవడ్రా నువ్వు)... 
ఓహ్... ఆప్.. ఓకే ఓకే (ఓహ్... మీరా... అయితే సరే)
హ్యాపీ హ్యాపీయెస్ట్ బర్త్ డే లావణ్య త్రిపాఠి
నువ్వు చల్లగా ఉండు... మా వరుణ్ తేజ్ బాబుని చల్లగా ఉంచు...
అంటూ ట్వీట్ చేశాడు. నెటిజెన్ల నుంచి ఈ పోస్టుకు విశేషమైన స్పందన వస్తోంది.
Sai Dharam Tej
Lavanya Tripathi
Birthday
Varun Tej
Tollywood

More Telugu News