Nara Lokesh: పలు నియోజకవర్గాలకు వైసీపీ ఇన్చార్జుల మార్పుపై లోకేశ్ స్పందన
- ఇటీవల 11 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చిన జగన్
- వ్యంగ్యంగా స్పందించిన నారా లోకేశ్
- చెత్త ఎక్కడైనా చెత్తే అంటూ ఎద్దేవా
- జగన్ ఓడిపోయే సీట్లు బీసీలకు ఇస్తున్నాడంటూ ఆరోపణలు
ఇటీవల రాష్ట్రంలోని 11 నియోజవర్గాలకు వైసీపీ ఇన్చార్జులను మార్చుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ వ్యంగ్యంగా స్పందించారు.
మన ఇంట్లో చెత్త తీసుకెళ్ళి పక్క ఇంటి ముందు పోసినంత మాత్రాన ఆ చెత్త బంగారం అవుతుందా...! అని ఎద్దేవా చేశారు. ఒక చోట అవినీతి చేసి, అసమర్థులుగా ముద్ర వేయించుకున్న వైసీపీ అభ్యర్థులు మరొక చోటుకు మారినంత మాత్రాన వారు మంచివాళ్లయిపోరు అని స్పష్టం చేశారు.
ఓడిపోయే సీట్లు బీసీలకి ఇస్తున్న జగన్... గెలుస్తాం అనుకునే సీట్లు ఒకే సామాజిక వర్గం వారికి ఇస్తున్నాడని లోకేశ్ ఆరోపించారు. కానీ, టీడీపీ అలా కాదు... గెలిచే సీట్లు మాత్రమే బీసీలకు కేటాయిస్తుంది అని ఉద్ఘాటించారు. మన బీసీలు, మన ఎస్సీలు అంటూ జగన్ మోసం చేస్తున్నాడని విమర్శించారు.