Surat Diamond Trading Center: ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాల వ్యాపార కేంద్రాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

PM Modi will inaugurate world biggest diamond trading center in Surat

  • భారత్ లో వజ్రాల వ్యాపారానికి కేంద్రంగా ఉన్న సూరత్
  • నిత్యం వేల కోట్ల వ్యాపారం
  • 35 ఎకరాల స్థలంలో భారీ భవన సముదాయం 
  • ఈ భవనంలో 4,500 కార్యాలయాల ఏర్పాటు

గుజరాత్ లోని సూరత్ నగరం వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరన్న సంగతి తెలిసిందే. ఇక్కడ్నించి అనేక దేశాలకు వజ్రాల ఎగుమతి జరుగుతుంది. నిత్యం వేల కోట్ల రూపాయల్లో వ్యాపారం జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో, సూరత్ లో 35 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాల వ్యాపార కేంద్రాన్ని నిర్మించారు. ఈ భారీ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రేపు (డిసెంబరు 17) ప్రారంభించనున్నారు. 

ఈ మహా భవన సముదాయంలో 4,500 కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఈ భవన నిర్మాణానికి నాలుగేళ్ల సమయం పట్టింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ లో ఉన్న డైమండ్ ట్రేడింగ్ సెంటర్ అతి పెద్ద వజ్రాల వ్యాపార కేంద్రంగా ఉంది. ఇప్పుడు సూరత్ డైమండ్ బోర్స్ సెంటర్ ఇజ్రాయెల్ వజ్రాల కేంద్రాన్ని అధిగమించింది. దాదాపు 65 వేల మంది వజ్రాల నిపుణులు ఈ భవనం నుంచి కార్యకలాపాలు సాగించనున్నారు.

  • Loading...

More Telugu News