Revanth Reddy: మేడిగడ్డ కుంగిపోవడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ: సీఎం రేవంత్ రెడ్డి
- మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది? ఎందుకు పనికి రాకుండా పోయింది? అనే విషయాలు తెలుసుకుంటామని వెల్లడి
- సమావేశాలు ముగిసిన తర్వాత సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకువెళతామన్న రేవంత్ రెడ్డి
- విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని వ్యాఖ్య
మేడిగడ్డ, అన్నారం కుంగిపోవడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ... మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది? ఎందుకు పనికి రాకుండా పోయింది? అనే విషయాలు తెలుసుకుంటామన్నారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకువెళతామని, విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. కాంట్రాక్టులు ఎవరు ఇచ్చారు? వారి వెనుక ఉన్న నాటి మంత్రులు ఎవరు? అధికారుల పాత్ర ఏమిటి? ఇలా అన్ని విషయాలు వెలుగులోకి తెస్తామన్నారు.
స్పీకర్, మండలి చైర్మన్ ఆదేశాలతో అసెంబ్లీ ఎదుట ముళ్ల కంచె తొలగింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇకపై పాత అసెంబ్లీ భవనంలో మండలి సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు.