Nara Lokesh: ఈ పథకాన్ని జగనన్న భూ భక్ష అంటే సరిపోయేది: నారా లోకేశ్ వ్యంగ్యం

Nara Lokesh Yuvagalam will conclude tomorrow

  • రేపటితో ముగియనున్న నారా లోకేశ్ యువగళం
  • గాజువాక నియోజకవర్గంలో పైలాన్ ఆవిష్కరించనున్న లోకేశ్
  • హాజరుకానున్న నారా భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర (సోమవారం) గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని శివాజీనగర్ వద్ద ముగియనుంది. ఈ సందర్భంగా లోకేశ్ పైలాన్ ను ఆవిష్కరిస్తారు. పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేలా పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. 

యువగళం ముగింపు కార్యక్రమానికి చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు హాజరు కానున్నారు. యువగళం పాదయాత్ర 225వ రోజు పెందుర్తి/గాజువాక నియోజకవర్గాల్లో కోలాహలంగా సాగింది. 

యువనేత లోకేశ్ పాదయాత్ర తోటాడ స్మార్ట్ సిటీ నుంచి ప్రారంభమై సిరసపల్లి, వెంకటాపురం మీదుగా భరణికం వద్ద పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా మాజీమంత్రి బండారు సత్యనారారాయణ మూర్తి నేతృత్వంలో లోకేశ్ కు పెందుర్తి ప్రజలు ఘనస్వాగతం పలికారు. 

అక్కడనుంచి పరవాడ, గొర్లవానిపాలెం, చింతలగొర్లవానిపాలెం, జాజులవానిపాలెం, దేశపాత్రునిపాలెం మీదుగా స్టీల్ ప్లాంట్ గేటు వద్ద గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. గాజువాక ఇన్ చార్జి పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో యువనేతకు అపూర్వ స్వాగతం లభించింది. 

లోకేశ్ సెల్ఫీ చాలెంజ్...

ఇవి యలమంచిలి నియోజకవర్గం తోటాడ వద్ద జగనన్న భూ రక్ష పేరుతో సిద్ధంగా ఉన్న హద్దు రాళ్లు. పరిపాలన కంటే స్టిక్కర్లు, బొమ్మలకే పెద్దపీట వేసే జగన్ రెడ్డి సర్వే రాళ్లను సైతం వదలకుండా వాటిపై తమ పేరు వేసుకున్నాడు. వాస్తవానికి ఆ పథకానికి జగనన్న భూ భక్ష అని పేరు పెడితే కరెక్టుగా సరిపోయేది. 

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన పేదలు, ప్రభుత్వ భూములు, ఆలయాల భూములు గుర్తించి వాటిని కొట్టేయడానికి వేసిన మాస్టర్ ప్లాన్. ముందు సర్వే అంటారు, తర్వాత రాళ్లు అంటారు, చివరిగా ఈ భూమి మాదే అంటారు. కావాలంటే రాళ్లపై మా జలగన్న బొమ్మ ఉంది చూసుకోండని చెబుతారు. ఇటువంటి సర్వే రాళ్లే మీ అరాచక ప్రభుత్వానికి సమాధిరాళ్లు కాబోతున్నాయి... రాసి పెట్టుకో జగన్మోసపురెడ్డీ

కలర్ మార్చినంత మాత్రాన... కట్టినవారి పేరు చెరగదు మై డియర్ సైకో జగన్!: లోకేశ్

పెందుర్తి నియోజకవర్గం పరవాడ శివారు గొర్లవానిపాలెంలో టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలివి. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లు కొత్తగా ఇళ్లు కట్టడం చేతగాని జగన్... టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలకు మాత్రం సిగ్గులేకుండా రంగులేసుకున్నాడు. 

చంద్రబాబునాయుడు నేతృత్వంలో గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3.13లక్షల టిడ్కో గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టి, 90 శాతానికి పైగా పూర్తి చేసింది. మిగిలిన 10 శాతం పూర్తిచేసి పేదలకు ఇవ్వడం చేతగాని జగన్... ఆ ఇళ్లపై బ్యాంకుల నుంచి అప్పుతెచ్చి వాడేశాడు. కలర్ మార్చినంత మాత్రాన కట్టినవారి పేరు చెరగదు మై డియర్ సైకో జగన్!

ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన లోకేశ్

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక అన్న ఎన్టీఆర్ అని నారా లోకేశ్ పేర్కొన్నారు. పెందుర్తి నియోజకవర్గం పరవాడ మార్కెట్ సెంటర్ లో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని లోకేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఢిల్లీ పాదాల చెంత తెలుగువారి ఆత్మగౌరవం బందీగా మారిన సమయంలో ప్రపంచం మేం తెలుగువారమని కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. 

పేదవాడికి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ కల్పించాలన్న లక్ష్యంతో 2 రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాల పంపిణీ, పక్కాగృహాల నిర్మాణం వంటి కార్యక్రమాలకు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

====

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఈరోజు నడిచిన దూరం 17.6 కి.మీ.*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 3119 కి.మీ.*

*226వరోజు (18-12-2023) యువగళం వివరాలు*

*గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం*

ఉదయం

8.00 – విశాఖ సిడబ్ల్యుసి-1 క్యాంప్ సైట్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.45 – నెహ్రూ పార్కు వద్ద ఆర్మీ ఉద్యోగులతో సమావేశం.

9.00 – తెలుగుతల్లి విగ్రహం వద్ద స్టీల్ ప్లాంట్ నిర్వాసితులతో సమావేశం.

10.00 – దుర్గానగర్ బస్టాప్ వద్ద పద్మశాలి సామాజిక వర్గీయులతో భేటీ.

10.15 – వై.జంక్షన్ లో యువనేతతో కలిసి శ్రామికుల అడుగులు.

10.30 – లయన్స్ క్లబ్ వద్ద గంగవరం పోర్టు డిపి ఉద్యోగులతో భేటీ.

10.35 – హనుమాన్ టెంపుల్ వద్ద స్థానికులతో మాటామంతీ.

10.40 – జగ్ జంక్షన్ వద్ద టూవీలర్ మెకానిక్ లతో సమావేశం.

10.45 – కెనరా బ్యాంక్ వద్ద స్థానికులతో మాటామంతీ.

10.50 – చినగంట్యాడలో యువనేతతో కలిసి రైతుల అడుగులు.

11.05 – ఎస్ఎఫ్ఎస్ స్కూలు వద్ద హామాలీ వర్కర్లతో సమావేశం.

11.15 – హనుమాన్ కమ్యూనిటీ వద్ద జంగమ సామాజికవర్గీయులతో భేటీ.

11.20 – వంటిల్లు జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్లతో సమావేశం.

11.30 – ఓల్డ్ గాజువాక జంక్షన్ లో యువనేతతో యువత అడుగులు.

11.45 – సిఎంఆర్ జంక్షన్ లో స్వర్ణకారులతో సమావేశం.

మధ్యాహ్నం

12.00 – ఆర్ కె హాస్పటల్ వద్ద స్థానికులతో మాటామంతీ.

12.10 – పోలీస్ స్టేషన్ జంక్షన్ లో తలసేమియా పేషెంట్లతో సమావేశం.

12.25 – టిఎస్ఆర్ అండ్ టిబికె కాలేజి వద్ద లాయర్లతో సమావేశం.

12.30 – శ్రీనగర్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో సమావేశం.

1.15 – వడ్లమూడి జంక్షన్ లో భోజన విరామం.

2.00 – భోజన విరామస్థలంలో అగ్రిగోల్డ్ బాధితులు, మీసేవా నిర్వాహకులతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – వడ్లమూడి జంక్షన్ వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.15 – కూర్మపాలెం జంక్షన్ లో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ప్రతినిధులతో భేటీ.

5.00 – గ్రేటర్ విశాఖ శివాజీనగర్ లో యువగళం పాదయాత్ర ముగింపు, పైలాన్ ఆవిష్కరణ.

******

  • Loading...

More Telugu News