Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి

President of India Smt Droupadi Murmu Arrival at Begumpet Airport
  • శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 
  • ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి
  • ఈ నెల 23న తిరిగి ఢిల్లీకి బయలుదేరనున్న ద్రౌపది ముర్ము
హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు... తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. రాష్ట్రపతికి గవర్నర్, సీఎంలు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా తదితర ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్రపతికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస ఏర్పాటు చేశారు. ఆమె 23వ తేదీన తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.
Droupadi Murmu
President Of India
Tamilisai Soundararajan
Revanth Reddy

More Telugu News