Corona Virus: కరోనా కొత్త వేరియంట్‌పై ఆందోళన అవసరం లేదు: భారతీయ వైద్యుల సంఘం తెలంగాణ శాఖ

TS Doctors associtaion on Corona new virus

  • ఈ వేరియంట్ మన దేశంతో పాటు మరికొన్ని దేశాల్లో సోకుతోందని వెల్లడి
  • ఇది అంత ప్రమాదకరం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోందన్న వైద్య బృందం
  • వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులు గల వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

కరోనా మహమ్మారిపై భారతీయ వైద్యుల సంఘం తెలంగాణ శాఖ స్పందించింది. కరోనాపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపింది. ప్రస్తుతం వ్యాపిస్తోన్న జేఎన్.1 వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంటేనని తెలిపింది. మన దేశంతో పాటు మరికొన్ని దేశాల్లో గత రెండు నెలలుగా ఈ వేరియంట్ సోకుతోందని స్పష్టం చేశారు. ఇది అంత ప్రమాదకరం కాదని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక విడుదల చేసిందని పేర్కొంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శ్వాసకోశ సంబంధ వ్యాధులు ప్రబలే అవకాశముందని వైద్య బృందం పేర్కొంది. వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులు గల వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

  • Loading...

More Telugu News