Pat Cummins: ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడు ప్యాట్ కమిన్స్... రికార్డు స్థాయిలో రూ.20.50 కోట్లకు కొనేసిన కావ్యా మారన్

SRH grabs Pat Cummins for record price

  • దుబాయ్ లో ఐపీఎల్ మినీ వేలం
  • ప్యాట్ కమిన్స్ కోసం సన్ రైజర్స్, ఆర్సీబీ హోరాహోరీ
  • పంతం నెగ్గించుకున్న కావ్యామారన్
  • రికార్డు ధరతో సన్ రైజర్స్ వశమైన కమిన్స్

వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాను చాంపియన్ గా నిలిపిన ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ వేలంలో చరిత్ర సృష్టించాడు. దుబాయ్ లో జరుగుతున్న మినీ వేలంలో కమిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికాడు. హోరాహోరీగా సాగిన వేలం పాటలో కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్ల రికార్డు ధరతో చేజిక్కించుకుంది. 

వేలంలో కమిన్స్ కోసం సన్ రైజర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలు హోరాహోరీ తలపడ్డాయి. ప్యాట్ కమిన్స్ కనీస ధర రూ.2 కోట్లు కాగా.... సన్ రైజర్స్, బెంగళూరు ఫ్రాంచైజీలు వేలంలో ఎక్కడా తగ్గకపోవడంతో పాట అమాంతం పెరిగిపోయింది. 

సన్ రైజర్స్ యజమాని కావ్యా మారన్ ఆసీస్ కెప్టెన్ కోసం ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధమన్న సంకేతాలు పంపారు. దాంతో, చూస్తుండగానే కమిన్స్ రేటు రూ.20.50 కోట్ల మార్కుకు చేరుకుంది. ఆ తర్వాత ఆర్బీబీ వేలం నుంచి విరమించుకోవడంతో, ఈ ఆసీస్ చాంపియన్ కెప్టెన్ సన్ రైజర్స్ వశమయ్యాడు. 

ఐపీఎల్ లో ఇప్పటివరకు అత్యధిక ధర రికార్డు ఇంగ్లండ్ యువ ఆల్ రౌండర్ శామ్ కరన్ పేరిట ఉంది. 2023 సీజన్ కోసం శామ్ కరన్ ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడా రికార్డును ప్యాట్ కమిన్స్ బద్దలుకొట్టాడు.

  • Loading...

More Telugu News