Revanth Reddy: ఉమ్మడి ఆస్తుల్లో తెలంగాణ వాటా తేల్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు
- ఢిల్లీలో తెలంగాణ నూతన భవన నిర్మాణంపై అధికారులతో చర్చ
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవన్ ఆస్తుల విభజన గురించీ చర్చ
- తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ భవన్ ఓఎస్డీ సంజయ్ జూజుతో సమావేశం
ఢిల్లీలో తెలంగాణ నూతన భవనం నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు. నూతన భవనంతో పాటు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన వంటి అంశాలపై కూడా ఆయన దృష్టి సారించారు. ఉమ్మడి ఆస్తుల్లో తెలంగాణ వాటా తేల్చే దిశగా అధికారులతో చర్చలు జరిపారు. ఢిల్లీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవన్ ఆస్తుల విభజన, తెలంగాణ కొత్త భవన నిర్మాణం తదితర అంశాలకు సంబంధించి అధికారులతో సమావేశమయ్యారు. ఈ మేరకు ఆయన తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ భవన్ ఓఎస్డీ సంజయ్ జూజుతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందడంతో ఆయన ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.