Bigg Boss: ప్రశాంత్, యావర్ లపై నా ఒపీనియన్ ఇదే: 'బిగ్ బాస్' శివాజీ

Shivaji Interview
  • బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ త్రీలో నిలిచిన శివాజీ
  • ప్రశాంత్ గేమ్ పై ఎక్కువ ఫోకస్ చేశానని వెల్లడి 
  • అందుకు కారణం అతని అమాయకత్వమని వ్యాఖ్య
  • యావర్ కీ ... ప్రశాంత్ కి తన సపోర్టు అవసరమని వివరణ  

బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ త్రీ వరకూ వచ్చిన శివాజీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరంగా మాట్లాడారు. 'బిగ్ బాస్ విజేతను నేనే .. కాకపోతే నేను పూర్తి ఫోకస్ పెట్టలేదంతే. యావర్ కి తెలుగు భాష రాదు .. ప్రశాంత్ పల్లెటూరు నుంచి వచ్చిన అమాయకుడు. అందువలన నేను వాళ్లకి కాస్త సపోర్టుగా నిలబడ్డానంతే" అన్నారు. 

ప్రశాంత్ వచ్చి 'అన్నా' అంటూ నన్ను హగ్ చేసుకున్నాడు. అతనిని ఆడనీయకుండా చేయాలనే సంకల్పంతో కొంతమంది ఉన్నారు. ప్రశాంత్ పై మాటల దాడి చేశారు .. వాళ్లకి నేను అడ్డుపడ్డాను. నిజం చెప్పాలంటే నేను నా గేమ్ పై కంటే కూడా ప్రశాంత్ గేమ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాను" అని చెప్పారు. 

"ఒక కామన్ మెన్ గెలవాలి అనే ఒక ఆలోచన కారణంగానే నేను ప్రశాంత్ కి అండగా నిలబడుతూ వచ్చాను. నేను చేయడం వల్లనే యావర్ చివరివరకూ వచ్చాడనీ .. ప్రశాంత్ విజేతగా నిలిచాడని చెప్పను. వాళ్ల ఆటతీరు .. టాలెంటు అందుకు కారణం. వాళ్లు ముందుకు వెళ్లడానికి కారణమైన ధైర్యాన్ని మాత్రమే నేను ఇచ్చాను" అని చెప్పారు శివాజీ.
Bigg Boss
Shivaji
Prashanth
Yavar

More Telugu News