President Of India: మా ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకువస్తా: చేనేత వస్త్రాలు చూసి ముచ్చటపడిన రాష్ట్రపతి

President Murmu participated in Theme Pevilion

  • చేనేత కార్మికులతో ఏర్పాటు చేసిన థీమ్ పెవిలియన్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి 
  • తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అందిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంస
  • నేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంతప్రజలకు మంచి ఉపాధి దొరుకుతోందన్న రాష్ట్రపతి

తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అందిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. బుధవారం చేనేత కార్మికులతో ఏర్పాటు చేసిన థీమ్ పెవిలియన్ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రౌపదిముర్ము మాట్లాడుతూ... నేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంతప్రజలకు మంచి ఉపాధి దొరుకుతోందన్నారు. పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే తనకు చాలా సంతోషం కలిగిందన్నారు. భారత సంస్కృతీ సంప్రదాయాల్లో చేనేత ఒకటి అన్నారు.

భూధాన్ పోచంపల్లిని ప్రపంచ గ్రామీణ పర్యాటక ప్రాంతంగా గుర్తించడం అభినందనీయమని పేర్కొన్నారు. చేనేత వస్త్రాల కృషి గొప్పదని... కళను వారసత్వంగా మరొకరికి అందించడం గొప్ప విషయమన్నారు. చేనేత రంగాన్ని కాపాడుకునే విధంగా కృషి చేయాలని సూచించారు. చేనేత అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమ ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకువస్తానని రాష్ట్రపతి అన్నారు.

  • Loading...

More Telugu News