Chandrababu: ఇసుక పాలసీ కేసు: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషిన్ పై ముగిసిన వాదనలు

AP High Court reserves verdict in Chandrababu anticipatory bail plea hearing

  • చంద్రబాబుపై సీఐడీ కేసు
  • గత ప్రభుత్వంలో ఇసుక పాలసీ వల్ల ఖజానాకు నష్టం వాటిల్లిందని ఆరోపణలు
  • ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇసుక విధానంతో ఖజానాకు తీవ్ర నష్టం జరిగిందంటూ సీఐడీ కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై గత కొన్ని వారాలుగా విచారణ జరుగుతోంది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేటి విచారణతో వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించగా... ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచింది.

  • Loading...

More Telugu News