Telangana: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు
- అనుమతుల్లేకుండా రాయలసీమ ఎత్తపోతల పథకం పనులు ప్రారంభించిందన్న తెలంగాణ
- తక్షణమే ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి
- ఈ మేరకు కేఆర్ఎంబీకి ఈఎన్సీ మురళీధరన్ లేఖ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించిందని కృష్ణా నది యాజమాన్య బోర్డుకు (కేఆర్ఎంబీ) తెలంగాణ ప్రభుత్వం బుధవారం లేఖ రాసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్కు ఈఎన్సీ మురళీధరన్ ఈ లేఖను రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఈఎన్సీ మురళీధరన్ ఫిర్యాదు చేశారు. ఎన్జీటీ ఉత్తర్వులు ఉల్లంఘించి మరీ పనులు చేస్తున్నారని ఈఎన్సీ తెలిపింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే ఈ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించాలని ఈఎన్సీ విజ్ఞప్తి చేసింది.