tsrtc: స్మార్ట్ ఫోన్‌లలో చూపిస్తే కుదరదు... ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి: ఉచిత బస్సు ప్రయాణంపై టీఎస్ఆర్టీసీ

Original identity card must and should for free bus in telangana

  • కొందరు మహిళలు గుర్తింపు కార్డులు తీసుకురావడం లేదని సంస్థ దృష్టికి వచ్చిందన్న సజ్జనార్
  • ఆధార్, ఓటర్, డ్రైవింగ్, తదితర గుర్తింపు కార్డులు చూపించి జీరో టిక్కెట్ పొందాలని సూచన
  • స్మార్ట్ ఫోన్లలో చూపిస్తే ఉచిత ప్రయాణానికి అనుమతి లేదని స్పష్టీకరణ

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకానికి ప్రయాణికులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపించాలని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ట్వీట్ చేశారు. ప్రయాణ సమయంలో కొందరు మహిళలు గుర్తింపు కార్డులు తీసుకురావడం లేదని సంస్థ దృష్టికి వచ్చిందని... గుర్తింపు కార్డుల ఫొటో కాపీలను తీసుకు వస్తున్నారని, స్మార్ట్ ఫోన్‌లలో సాప్ట్ కాపీలు చూపిస్తున్నారని తెలిసిందని పేర్కొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్, డ్రైవింగ్, తదితర గుర్తింపు కార్డులను చూపించి జీరో టికెట్లను తీసుకోవాలని మహిళలను కోరుతున్నామన్నారు. ఫొటో కాపీలను స్మార్ట్ ఫోన్లలో చూపిస్తే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. గుర్తింపు కార్డుల్లోనూ ఫొటోలు స్పష్టంగా కనిపించాలని సూచించారు.

చాలామంది ఆధార్ కార్డుల్లో చిన్నతనం నాటి ఫొటోలు ఉన్నాయని, వాటిని అప్ డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకే ఈ స్కీమ్ వర్తిస్తుందని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల మహిళలు విధిగా చార్జీలు చెల్లించి టికెట్ తీసుకోవాలని స్పష్టం చేశారు.  

  • Loading...

More Telugu News