Dacoit Title Teaser: అడివి శేష్, శ్రుతిహాసన్ నటిస్తున్న ‘డెకాయిట్’ టైటిల్ టీజర్ విడుదల

Dacoit Title Teaser Released Adivi Sesh Shruti Haasan
  • శత్రువులుగా మారిన ప్రేమికుల కథతో రూపుదిద్దుకుంటున్న డెకాయిట్
  • అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న మూవీ
  • టైటిల్ టీజర్‌కు నెట్టింట మంచి స్పందన
ఆసక్తికర మూవీలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో అడివి శేష్ డెకాయిట్ మూవీతో అభిమానుల ముందుకు రానున్నాడు. శ్రుతిహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా షానీల్ డియో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో చిత్రబృందం చిత్రం టైటిల్‌ను ప్రకటిస్తూ టీజర్ విడుదల చేసింది. ఇటీవలే విడుదలైన సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ టీజర్‌ కూడా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. బద్ధ శత్రువులుగా మారిన ప్రేమికుల కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ, అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌పై డెకాయట్‌ను భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. 
Dacoit Title Teaser
Adivi Sesh
Shruti Haasan

More Telugu News