Narendra Modi: అలాంటి దేశంతో భారత్ ను పోల్చవద్దు: ప్రధాని మోదీ
- భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని మోదీ వెల్లడి
- చైనాలో ప్రజాస్వామ్యం లేదని వ్యాఖ్యలు
- ప్రజాస్వామ్య దేశాలతో భారత్ ను పోల్చాలని స్పష్టీకరణ
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్థికాభివృద్ధి అంశంలో భారత్ ను ఎప్పుడూ చైనాతో పోల్చవద్దని స్పష్టం చేశారు. చైనా నియంతృత్వ పాలనలో ఉన్న దేశమని, అలాంటి దేశంతో భారత్ ను పోల్చడం సరికాదని అన్నారు. భారత్ ను ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పోల్చడం సబబుగా ఉంటుందని మోదీ అభిప్రాయపడ్డారు. చైనాలో ప్రజాస్వామ్యం లేదని వ్యాఖ్యానించారు. భారత్ లో నిరుద్యోగం, అవినీతి వంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. ఆ సమస్యలే ఉంటే భారత్ ఇంత వేగంగా అభివృద్ధి సాధించి ఉండేది కాదని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పురోగతి సాధిస్తున్న దేశం భారత్ అని మోదీ ఉద్ఘాటించారు.