Telangana: ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది... ఢిల్లీకి బయలుదేరిన ద్రౌపది ముర్ము

President Murmu leaves for Delhi after 5 day southern sojourn
  • హకీంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన రాష్ట్రపతి
  • వీడ్కోలు పలికిన గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు
  • ఆనవాయితీలో భాగంగా నిన్న ఎట్ హోమ్ నిర్వహించిన రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ముగించుకొని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. హకీంపేట విమానాశ్రయంలో ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ప్రభుత్వ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. అంతకుముందు ఆనవాయితీలో భాగంగా బొల్లారంలోని తన నివాసంలో రాష్ట్రపతి శుక్రవారం ఎట్ హోమ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్, సీఎంతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తదితరులు పాల్గొన్నారు.
Telangana
Hyderabad
Droupadi Murmu
Revanth Reddy
Tamilisai Soundararajan

More Telugu News