Jagan: కడప నుంచి తాడేపల్లికి పయనమైన జగన్
- ఈ ఉదయం పులివెందుల చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్
- జిల్లా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ దస్తగిరి కుమారుడు, కుమార్తెల వివాహానికి హాజరైన సీఎం
- ఆ తర్వాత విజయవాడకు తిరుగుపయనం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లా పర్యటన ముగిసింది. కడప ఎయిర్ పోర్ట్ నుంచి గన్నవరంకు ఆయన బయల్దేరారు. ఈ ఉదయం పులివెందులలోని క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం జగన్, ఆయన తల్లి విజయమ్మ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను జగన్, విజయమ్మ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఆదిమూలపు సురేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మైదుకూరుకు చేరుకున్నారు. కడప జిల్లా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ దస్తగిరి కుమారుడు, కుమార్తెల వివాహానికి హాజరయ్యారు. ఆ తర్వాత కడపకు చేరుకుని విజయవాడకు తిరుగుపయనమయ్యారు.