OTT: ఓటీటీ వేదికలకు శుభవార్త చెప్పిన కేంద్రం

Center told good news for OTTs

  • ఓటీటీ వేదికల్లో అశ్లీలం, హింస మితిమీరుతున్నాయని విమర్శలు
  • ఓటీటీలకు సెన్సార్ ఉండాలని డిమాండ్లు
  • కొత్త టెలికాం బిల్లు ఆమోదించిన పార్లమెంటు
  • అందులో ఓటీటీలకు సంబంధించిన అంశాలేవీ లేవన్న మంత్రి అశ్విని వైష్ణవ్

ఓటీటీ వేదికలు, పలు యాప్ లకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఓటీటీలు, ఆయా యాప్ లు కొత్త టెలికాం బిల్లు పరిధిలోకి రావని కేంద్ర ఐటీ, టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఓటీటీ వేదికలకు పాత చట్టమే వర్తిస్తుందని తెలిపారు. ఓటీటీలు ఐటీ యాక్ట్-2000 ప్రకారం కార్యకలాపాలు నిర్వర్తించుకోవచ్చని వివరించారు. పార్లమెంటు ఆమోదించిన కొత్త టెలికాం బిల్లులో ఓటీటీలకు సంబంధించిన అంశాలేవీ లేవని స్పష్టం చేశారు. 

ఇప్పటివరకు దేశంలో 1885 టెలిగ్రాఫ్ చట్టం, వైర్ లెస్ టెలిగ్రఫీ యాక్ట్-1993, టెలిగ్రాఫ్ వైర్స్ (అక్రమంగా కలిగివుండడడం) చట్టం-1950 అమల్లో ఉన్నాయి. 

కాగా, ఓటీటీల్లో హింస, అశ్లీలత ఎక్కువగా ఉన్నాయని, వీటిని సెన్సార్ పరిధిలోకి తెచ్చేలా కొత్త చట్టం తీసుకురావాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్న తరుణంలో కేంద్రం తాజా ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మెసేజింగ్ యాప్ లకు కూడా ఇదే నిర్ణయం వర్తిస్తుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News