traffic challan: ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు... రాయితీ చెల్లింపులకు అనూహ్య స్పందన
- రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపులతో రూ.8.44 కోట్ల ఆదాయం
- హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలోనే రూ.5 కోట్లకు పైగా రాబడి
- అనూహ్య స్పందనతో సర్వర్ డౌన్
రాయితీతో ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపుకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు వసూలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపులతో రూ.8.44 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువగా రాజధాని హైదరాబాద్ ప్రాంతం నుంచే వచ్చింది.
హైదరాబాద్ పరిధిలో 3.54 లక్షల చలాన్ల ద్వారా రూ.2.62 కోట్లు, సైబరాబాద్ పరిధిలో 1.82 లక్షల చలాన్ల ద్వారా రూ.1.80 కోట్లు, రాచకొండ పరిధిలో 93వేల చలాన్ల ద్వారా రూ.76.79 లక్షల ఆదాయం సమకూరింది. పెద్ద ఎత్తున చెల్లింపులు జరుపుతుండటంతో చెల్లింపులకు సంబంధించి సర్వర్ కూడా డౌన్ అవుతోంది.
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్‌ను ప్రకటిస్తూ మంగళవారం జీవో విడుదలైంది. టూ వీలర్స్, త్రీవీలర్స్ వాహనాలపై 80 శాతం, ఫోర్ వీలర్స్, హెవీ వెహికిల్స్‌పై 60 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం రాయితీని ప్రకటించారు.