VV Lakshminarayana: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కార్యాచరణ ప్రకటించిన జై భారత్ పార్టీ చీఫ్ లక్ష్మీనారాయణ

VV Lakshminarayana announces program schedule for special status struggle
  • ఇటీవల కొత్త పార్టీ స్థాపించిన సీబీఐ మాజీ జేడీ
  • ప్రత్యేక హోదా అధ్యాయం ఇప్పుడే మొదలైందని తాజా వ్యాఖ్యలు
  • బ్యాడ్జిలు ధరించి పోరాటం చేద్దామని పిలుపు
  • ఎన్నికల కోసమే టీడీపీ, వైసీపీ హోదా అంశాన్ని లేవనెత్తుతున్నాయని విమర్శలు
ఇటీవల జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై తమ పార్టీ కార్యాచరణను ప్రకటించారు. 

విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదా అధ్యాయం ఇప్పుడే మొదలైందని అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం బ్యాడ్జిలు ధరించి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. జనవరి 26న ప్రత్యేక హోదా కోసం ప్రతిజ్ఞ చేద్దామని సూచించారు. రాజకీయ పార్టీలు కాదు... ప్రజలు ఉద్యమిస్తేనే హోదా వస్తుందని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కేంద్రం బాధ్యత అని స్పష్టం చేశారు. ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని అప్పటి ప్రభుత్వం చెబితే... కాదు, పదేళ్లు కావాలని అప్పుడు బీజేపీ చెప్పిందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. టీడీపీ, వైసీపీ ఎన్నికల కోసమే హోదా అంశాన్ని లేవనెత్తుతున్నాయని ఆయన విమర్శించారు.
VV Lakshminarayana
Jai Bharat National Party
AP Special Status
Andhra Pradesh

More Telugu News