Sharada Temple Pok: పీఓకేలోని శారదా దేవాలయాన్ని పాక్ సైన్యం ఆక్రమించింది: ఎస్ఎస్‌సీ కమిటీ వ్యవస్థాపకుడు

 Pak army occupied saradapeeth premises in pok says ssc founder

  • శారదా ఆలయం పరిసరాల్లో పాక్ సైన్యం కాఫీ హోం నిర్మిస్తోందని వెల్లడి
  • కోర్టు తీర్పులను తోసిరాజని సైన్యం కొత్త నిర్మాణాలు చేస్తోందన్న ఎస్ఎస్‌సీ కమిటీ వ్యవస్థాపకుడు
  • ఈ విషయంలో భారత్ జోక్యం చేసుకోవాలని అభ్యర్థన

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రముఖ శారదా దేవాలయం పరిసరాలను ఆక్రమించిన పాక్ సైన్యం అక్కడ కాఫీ హోంను నిర్మిస్తోందని సేవ్ శారద కమిటీ (ఎస్ఎస్‌సీ) వ్యవస్థాపకుడు రవీంద్ర పండిత వెల్లడించారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలంటూ బెంగళూరులో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ స్థలానికి సంబంధించి కోర్టు గతంలో అనుకూల తీర్పు కూడా వెలువరించిందన్న ఆయన.. పాక్ సైన్యం ఆక్రమణలకు దిగుతోందని చెప్పారు. 

‘‘పాక్ సైన్యం అక్కడి స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతోంది. ఆలయ గోడలను ధ్వంసం చేస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ మేం పోరాడతాం. పీవోకేలోని స్థానిక ప్రజలు కూడా మాకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే, మా పోరాటానికి భారత ప్రభుత్వం మద్దతు కోరుతున్నాం. వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని ఆలయ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి. శారద ఆలయాన్ని అభివృద్ధి చేయాలి, వారసత్వ సంపదగా గుర్తింపునివ్వాలి’’ అని రవీంద్ర కోరారు.

  • Loading...

More Telugu News