Tamilisai Soundararajan: నేను రాజీనామా చేయడం లేదు... పోటీ కూడా చేయడం లేదు: గవర్నర్ తమిళిసై

- లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తాననే ప్రచారంలో నిజం లేదన్న తమిళిసై
- ఎంపీగా పోటీ చేస్తానని ఎవరికీ విజ్ఞప్తి చేయలేదని స్పష్టీకరణ
- వరదల ప్రభావం నేపథ్యంలో తూత్తుకుడికి వెళ్లివచ్చానన్న గవర్నర్
తాను ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని... తాను రాజీనామా చేస్తున్నాననే ప్రచారంలో నిజంలేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం స్పష్టం చేశారు. తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గా ఉన్న తమిళిసై రాజీనామా చేస్తారనే ప్రచారం సాగింది. దీనిపై ఆమె వివరణ ఇచ్చారు. తన రాజీనామాపై వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తాను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేస్తాననే ప్రచారం జరుగుతోందని, అది అవాస్తవమన్నారు. తాను ఎంపీగా పోటీ చేస్తానని ఎవరికీ... ఎలాంటి విజ్ఞప్తి చేయలేదన్నారు.
తాను అసలు ఢిల్లీ వెళ్లలేదని... పోటీ చేస్తానని ఎవరినీ ఆడగలేదన్నారు. వరదల ప్రభావం వల్ల తాను కేవలం తూత్తుకుడికి మాత్రమే వెళ్లివచ్చానని వెల్లడించారు. తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. తాను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటున్నట్లు తెలిపారు. శ్రీరాముల వారి దయతో... ప్రధాని నరేంద్ర మోదీ దయతో తాను విధులను నిర్వహిస్తున్నానన్నారు. అధిష్ఠానం తనకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానన్నారు.