Akshar patel: పంత్ యాక్సిడెంట్ వార్త తెలిశాక కొన్ని క్షణాలపాటు భయం వెంటాడింది: అక్షర్ పటేల్

Akshar Patel Reaction About Rishab Panth Accident Incident
  • ఆ రోజు ఉదయం తన సోదరి ఫోన్ చేసి చెప్పిందన్న క్రికెటర్
  • సరిగ్గా గతేడాది డిసెంబర్ 30న డెహ్రడూన్ దగ్గర్లో ప్రమాదం
  • కారు బోల్తా పడడంతో తీవ్రంగా గాయపడ్డ రిషబ్ పంత్
భారత క్రికెట్ జట్టు సభ్యుడు, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ గతేడాది డిసెంబర్ 30న ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తల్లిని సర్ ప్రైజ్ చేయాలని ఒంటరిగా కారులో బయలుదేరిన పంత్.. డెహ్రాడూన్ దగ్గర్లో ప్రమాదానికి గురయ్యాడు. ఆయన నడుపుతున్న కారు హైవేపై బోల్తా కొట్టింది. తీవ్ర గాయాలపాలైన పంత్ ను మిగతా వాహనదారులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి తన అనుభవాన్ని మరో క్రికెటర్ అక్షర్ పటేల్ తాజాగా ఓ వీడియోలో పంచుకున్నాడు. ఆ రోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగగా ఉదయం 7 గంటలకు తన సోదరి ప్రతిమ ఫోన్ తో నిద్ర లేచానని అక్షర్ పటేల్ చెప్పాడు.

‘పంత్ తో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడావని ప్రతిమ దీదీ అడిగితే నిన్న మాట్లాడాలని ప్రయత్నించా కానీ కుదరలేదని చెప్పాను. వెంటనే పంత్ అమ్మగారి ఫోన్ నెంబర్ ఉంటే పంపించు అనడంతో ఎందుకని అడిగా. పంత్ కు యాక్సిడెంట్ అయిందని ప్రతిమ దీదీ చెప్పడంతో షాక్ కు గురయ్యా. ఒక్కసారిగా భయం ఆవరించింది. పంత్‌కు ఏదో జరిగిపోయిందని భావించా’ అని అక్షర్‌ పటేల్ భావోద్వేగానికి గురయ్యాడు.
Akshar patel
Rishab panth
Panth Accident
Delhi capitals
Dehradun
Road Accident

More Telugu News