Kim Jong Un: అమెరికా, దక్షిణకొరియాలకు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వార్నింగ్

Kim Jong Un warning to USA and South Korea

  • తమను రెచ్చగొట్టొద్దని హెచ్చరించిన కిమ్  
  • అణ్వాయుధాలను వాడేందుకు కూడా వెనుకాడబోమని వార్నింగ్
  • తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నిస్తున్న వారితో సంబంధాలు పెట్టుకోబోమని వ్యాఖ్య

తమను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దంటూ అమెరికా, దక్షిణకొరియా దేశాలను ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. ఇకపై దక్షిణకొరియాతో సయోధ్య ప్రయత్నాలు ఉండవని చెప్పారు. మిలిటరీ కమాండర్ల మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా, దక్షిణకొరియా దేశాలు సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే... అణ్వాయుధాలను వాడటానికి కూడా వెనుకాడబోమని అన్నారు.

 తమ దేశాన్ని శత్రువుగా ప్రకటించి, తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్న దేశాలతో ఎలాంటి సంబంధాలు కొనసాగించబోమని చెప్పారు. మరోవైపు దేశంలోని ఆయుధ తయారీదారులకు గత వారం కిమ్ జోంగ్ కీలక ఆదేశాలను జారీ చేశారు. అమెరికాతో ఎలాంటి ఘర్షణ తలెత్తినా... ఎదుర్కొనేందుకు వీలుగా ఆయుధాల తయారీని వేగవంతం చేయాలని చెప్పారు. ఇంకోవైపు ఉత్తరకొరియా జాతీయ మీడియా సంస్థ కేసీఎన్ఏ తన కథనంలో అమెరికాపై విమర్శలు గుప్పించింది. అమెరికా కారణంగానే ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరిగిపోయాయని ఆరోపించింది.

  • Loading...

More Telugu News