Stock Market: కొత్త సంవత్సరాన్ని లాభాలతో ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు
- ఒడిదుడుకుల మధ్య చివరకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 32 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 11 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
2024 సంవత్సరాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు పాజిటివ్ గా ప్రారంభించాయి. ఈ ఉదయం నుంచి ఒడిదుడుకుల మధ్య కొనసాగిన సూచీలు చివరకు స్వల్ప లాభాలను మూటకట్టుకున్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, అంతర్జాతీయంగా మార్కెట్లను ప్రభావితం చేయగలిగే సంకేతాలు లేకపోవడంతో మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 32 పాయింట్లు లాభపడి 72,271కి చేరుకుంది. నిఫ్టీ 11 పాయింట్లు పుంజుకుని 21,742 వద్ద స్థిరపడింది.
నెస్లే ఇండియా (2.89%), టెక్ మహీంద్రా (2.00%), టాటా మోటార్స్ (1.25%), విప్రో (1.19%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.16%).
భారతి ఎయిర్ టెల్ (-1.92%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.31%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.66%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.53%), ఎన్టీపీసీ (-0.53%).