Arun Yogiraj: అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించనున్న రాముడి విగ్రహం శిల్పి ఎవరో తెలుసా?

Ayodhya Temple Mysuru sculptor Arun Yogirajs Ram Lalla idol selected for January 22 installation
  • మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన సీతారామలక్ష్మణుల విగ్రహం ఎంపిక
  • సోమవారం వెల్లడించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి 
  • అరుణ్ యోగిరాజ్ శిల్పం ఎంపికపై యడియూరప్ప హర్షం
మైసూరుకు (కర్ణాటక) చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు అరుదైన అదృష్టం దక్కింది. ఆయన రూపొందించిన రామ్ లల్లా విగ్రహాన్ని అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించనున్నట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సోమవారం ప్రకటించారు. రాముడు ఎక్కడ ఉంటాడో హనుమంతుడు అక్కడ ఉంటాడని, ఇందుకు తగ్గట్టుగా విగ్రహం ఎంపిక చేశామని మంత్రి తెలిపారు. 

అరుణ్ యోగిరాజ్ రూపొందించిన శిల్పం ఎంపికపై రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇది తమకు ఎంతో గర్వకారణమని అన్నారు. రాష్ట్రంలోని రామ భక్తుల సంతోషం రెట్టింపైందన్నారు. శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Arun Yogiraj
Ayodhya Ram Mandir

More Telugu News